Social Icons

Pages

Master Venu(1916–1981) - Music Director


మాస్టర్ వేణు (1916 - 1981 ) తెలుగు సినిమా సంగీత దర్శకులు. ఇతని అసలు పేరు మద్దూరి వేణుగోపాల్. వేణు మేనమామ అయినటువంటి రామయ్య నాయుడు గారి వద్దనే వాద్య సంగీతం నేర్చుకున్నారు. పదేళ్ళ వయసుకే ఈయన హార్మోనియం వాయించడంలో దిట్ట అయ్యాడు. 14వ యేట నుండే వేణు కచేరీలు ఇవ్వడం మొదలుపెట్టాడు. భీమవరపు నరసింహరావు గారి స్వరసారథ్యంలో వచ్చిన "మాలపిల్ల" సినిమాకి సహయకునిగా అలాగే హార్మోనిస్ట్ గా పనిచేశాడు. బొంబాయిలో మనహర్ బార్వే నడుపుతున్న "స్కూల్ ఆఫ్ మ్యూజిక్" లో చేరి, ఆరు నెలలు తిరగకుండానే ఆ విద్యాలయంలో మాస్టర్ డిగ్రీ తీసుకున్నాడు. అప్పట్నుంచే "మాస్టర్ వేణు" అయ్యాడు. వేణుకి నౌషాద్ స్వరపరిచిన గీతాలంటే ఎనలేని మక్కువ. 1946లో వేణు బొంబాయి నుంచి తిరిగి వచ్చి మద్రాసులో ఉన్న హెచ్.ఎం.వి కంపెనీలో రెండేళ్ళు పని చేశాడు. అక్కడ చాలా ప్రైవేట్ పాటలు స్వరపరచాడు.విజయా వారు అమెరికా నుండి "హేమాండ్ ఆర్గాన్" అనే కొత్త వాద్యాన్ని ఆ రోజుల్లో పదహారు వేల రూపాయలకు ఆర్డర్ ఇచ్చి తెప్పించారు. ఈ వాద్యాన్ని అప్పట్లో వేణు తప్ప ఎవ్వరూ వాయించలేకపోయేవారు. ఆ వాద్యాన్ని "గుణసుందరి కథ", "పాతాళభైరవి" మరియు "మల్లీశ్వరి" తదితర చిత్రాల్లో ఉపయోగించాడు.
జీవనసరాగాలు:
పూర్తి పేరు : మద్దూరి వేణుగోపాల్.
జననం : 1916
జన్మస్థలం : మచిలీపట్నం (బందరు)
భార్య : శకుంతలాదేవి
సంతానం : ఇద్దరు కొడుకులు
మూర్తి చందర్ - ఫిలాసఫర్
వెంకట సత్య సుబ్రమన్యేశ్వర భాను చందర్ ప్రసాద్ (భాను చందర్) - నటుడు
ఇష్టమైన వాద్యాలు : సితార, పియానో
అభిమాన తారలు : ఎస్వి రంగారావు, బలరాజ్ సహానీ
మరణం : 8 సెప్టెంబర్, 1981


చిత్రసమాహారం:
మాలపిల్ల భీమవరపు నరసింహరావు తో (1938)
వాల్మీకి (1945)
వాలి సుగ్రీవ (1950)
అంతా మనవాళ్ళే (1954)
రోజులు మారాయి (1955)
బీదల ఆస్తి రి-రికార్డింగ్ మాత్రమే (1955)
ఏది నిజం (1956)
సతీ సావిత్రి (1957)
తోడి కోడళ్ళు (1957)
పెద్దరికాలు (1957)
ఎత్తుకు పై ఎత్తు (1958)
ఆడపెత్తనం సాలూరు రాజేశ్వరరావు తో (1958)
ముందడుగు (1958)
మాంగల్యబలం (1958)
భాగ్య దేవత (1959)
వచ్చిన కోడలు నచ్చింది (1959)
నమ్మిన బంటు సాలూరు రాజేశ్వరరావు తో (1960)
జల్సారాయుడు (1960)
రాజ మకుటం (1960)
కులదైవం (1960)
కుంకుమ రేఖ (1960) : తీరెను కోరిక తీయ తీయగ, హాయిగ మనసులు తేలిపోవగ
శాంతి నివాసం (1960)
కలసి ఉంటే కలదు సుఖం (1961)
బాటసారి (1961)
పెళ్లికాని పిల్లలు (1961)
అర్ధరాత్రి (1961)
సిరి సంపదలు (1962)
సోమవార వ్రత మహత్యం (1963)
ఇరుగు పొరుగు (1963)
మురళీకృష్ణ (1964)
ప్రేమించి చూడు (1965)
అడుగు జాడలు (1966)
భార్య (1968)
కలసిన మనసులు (1968)
వింత కాపురం (1968)
నిండు సంసారం (1968)
బాగ్దాద్ గజదొంగ (1968)
బొమ్మలు చెప్పిన కధ (1969)
ఆడజన్మ (1970)
విధివిలాసం (1970)
అందరూ బాగుండాలి (1971)
అత్తను దిద్దిన కోడలు (1972)
ఉత్తమ ఇల్లాలు (1974)
వధూవరులు (1976)
దాన ధర్మాలు [విడుదల కాలేదు] (1976)
మేలుకొలుపు (1978)
మావారి మంచితనం (1979)
మోహన రాగం [విడుదల కాలేదు] (1980)
ప్రేమ కానుక (1980)
 

Bhajans

Kids Telugu Rhymes

Private & Folk Songs