Social Icons

Pages

Satyam(1933 - 12 జనవరి, 1989) - Music Director


చెళ్లపిళ్ల సత్యం (సత్యనారాయణ) (1933 - 1989) తెలుగు సినిమాలలో ప్రముఖ సంగీత దర్శకులు.

బాల్యం, విద్యాభ్యాసం:
ఇతడు విజయనగరం జిల్లాలో కొమరాడ గ్రామంలో జన్మించారు. సత్యం వంశస్థులంతా సంగీత సాహిత్యాలలో ఉద్దండులే. ముఖ్యంగా ముత్తాత చెళ్లపిళ్ల వేంకట కవి, ఆ కాలంలో తిరుపతి వేంకట కవులలో ఒకనిగా, మహాకవిగా కీర్తి గడించారు. చిన్నప్పటి నుంచి సంగీతం అంటే ఆసక్తి కనబరిచేవాడు. హరికధా భాగవతార్ అయిన తాతయ్య చెళ్ళపిళ్ళ సత్యనారాయణ దగ్గర పదేళ్ళ వయసులోనే సంగీతం పాఠాలు ప్రారంభించి కృతులు వరకూ నేర్చుకున్నడు. సాలూరుకు చెందిన పట్రాయని సీతారామశాస్త్రి ఆ చుట్టుపక్కల ఊళ్ళల్లో పేరొందిన విద్వాంసుడు. ఆయన దగ్గర కొంతకాలం సంగీతం నేర్చుకున్నాడు. ఓరోజు కాకినాడకు చెందిన "యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్" వారి డ్రామా వేయడానికి సాలూరు వెళ్లాడు. ఆదినారాయణరావు గారు ఆ క్లబ్ కు కీలక వ్యక్తి. స్నేహితులంతా సత్యాన్ని తీసుకెళ్లి ఆయనకు పరిచయం చేశారు. అక్కడి నుంచి "యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్"లో ఆదినారాయణరావుకు సహాయకునిగా పనిచేయడం మొదలుపెట్టాడు. అదే సమయంలో ఆదినారయణరావుకు అంజలీ దేవితో వివాహం అయింది. ఆదినారాయణరావు గారు ఓపెద్ద ఇల్లు తీసుకున్నారు. వాళ్ళతో పాటే సత్యం కూడా అందులో చేరాడు. ఆదినారాయణరావు ఆర్కెస్ట్రాలో తబలా నిపుణుడైన పెద్ద అంజయ్య ఉండేవారు. ఆయన డోలక్ ఎలా వాయిస్తున్నాడో సునిశితంగా గమనిస్తూ, ఎవరూ లేనప్పుడు అలా అనుకరిస్తూ నేర్చుకుంటుండే వాడు. ఆ తరువాత టి.వి. రాజు గారి ఆర్కెస్ట్రాలో ఎనిమిదేళ్లు అక్కడే పనిచేశాడు.
సినీ జీవితం:
62వ సంవత్సరంలో ఎం.ఎస్.నాయక్ నిర్మించిన "శ్రీ రామాంజనేయ యుద్ధ" అనే కన్నడ సినిమాకి మొదటిసారిగా సంగీత దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని నూటికి నూరు పాళ్ళు సద్వినియోగం చేసుకున్నాడు సత్యం. మొదట్లో తెలుగులో అడప దడప సినిమాలు చేస్తూన్నా మంచి గుర్తింపు రాలేదు ' ఈలోపు కన్నడంలో 42 సినిమాలకు స్వరకల్పన చేశాక 1973 లో "కన్నె వయసు" సినిమా తరువాత ఇక తెలుగులో వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. సత్యం స్వరజీవితంలోనే అగ్రతాంబూలం ఇవాల్సిన "ఏ దివిలో విరిసిన పారిజాతమో" పాట ఈ సినిమాలోనిదే. ఇలా తన 20 ఏళ్ల సినీ జీవితంలో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు. కృష్ణంరాజు, చిరంజీవి వంటి అగ్రతారల చిత్రాలకు విజయవంతమైన సంగీతం అందించారు. 70 వ దశకంలో దాదాపు కృష్ణ నటించిన అన్నీ కౌబాయ్ చిత్రాలకు సత్యమే స్వరసారధి. నటుడు చలం నిర్మాతగా తీసిన మరియు హీరోగా నటించిన దాదాపు 20 సినిమాలకు సత్యమే ఆస్థాన సంగీత దర్శకుడు. సత్యానికి బాగా ఇష్టమైన వాద్యం తబలా. తబలా లేకపొతే సత్యం సంగీతం లేదు అని చాలాసార్లు చెప్పేవారు. రీరికార్డింగ్ సమకూర్చడంలో సత్యానిది ఓ ప్రత్యేక శైలి.సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలు:
సవతి కొడుకు (తెలుగు) (1963)
ఇది భూతల స్వర్గం ఓరన్నా
సర్కార్ ఎక్స్ ప్రెస్ (తెలుగు) (1968)
రాజయోగం (తెలుగు) (1968)
పాల మనసులు (తెలుగు) (1968) : పాలవంక సీమలో
ప్రతీకారం (1969)
లవ్ ఇన్ ఆంధ్రా (తెలుగు) (1969)
టక్కరి దొంగ చక్కని చుక్క (తెలుగు) (1969) : కలలు కనే కమ్మని చిన్నారి
భలే ఎత్తు చివరకు చిత్తు (తెలుగు) (1970)
రౌడీ రాణి(తెలుగు) (1970)
పగ సాధిస్తా(తెలుగు) (1970)
మట్టిలో మాణిక్యం (తెలుగు) (1971) : మళ్లీ మళ్లీ పాడాలి యీ పాట, రిమ్ జిమ్ రిమ్ జిమ్ హైదరబాద్.
మాస్టర్ కిలాడి(తెలుగు) (1971)
బంగారు కుటుంబం (తెలుగు) (1971)
చలాకీ రాణి కిలాడీ రాజ (1971)
కత్తికి కంకణం
రివాల్వర్ రాణి
జేమ్స్ బాండ్ 777
సి.ఐ.డి. రాజు
నమ్మక ద్రోహులు
రౌడీలకు రౌడీలు (1971) : తీస్కో కోకోకోలా వేస్కో రమ్ము సోడా
పాపం పసివాడు(1972) : అమ్మా చూడాలి నిన్ను నాన్నను చూడాలి
నిజం నిరూపిస్తా (1972)
ఊరికి ఉపకారి(1972)
బుల్లెమ్మ బుల్లోడు(1972) : అమ్మ అన్నది ఒక కమ్మని మాట
దేవుడమ్మ (1972) : ఎక్కడో దూరాన కూర్చున్నావు ఇక్కడి మా తలరాతలు రాస్తున్నావు
కొరడా రాణి (1972)
మొనగాడొస్తున్నాడు జాగ్రత్త(1972)
పిల్లా పిడుగా(1972)
మా ఊరి మొనగాళ్ళు(1972)
హంతకులు దేవాంతకులు(1972)
మా ఇంటి వెలుగు(1972)
కలవారి కుటుంబం(1972)
కత్తుల రత్తయ్య(1972)
భలే మోసగాడు(1972)
అంతా మన మంచికే(భానుమతి తో) (తెలుగు) (1972) : నవ్వవే నా చెలీ
బాలమిత్రుల కథ (1972) : గున్నమామిడి కొమ్మమీద గూళ్లు రెండున్నాయి
వాడే వీడు(1973) : అటు చల్లని వెలుగుల జాబిలి
మంచివాళ్ళకు మంచివాడు(1973)
జగమే మాయ(1973) : నీ మదిలో నేనే ఉంటే
స్నేహ బంధం(1973) : స్నేహబంధము ఎంత మధురము
రాముడే దేముడు(1973)
కన్నె వయసు(1973) : ఏ దివిలో విరిసిన పారిజాతమో
గీతా(1973) :పూచే పూలలోన వీచే గాలిలోన
బంగారు మనసులు(1973)
పుట్టినిల్లు - మెట్టినిల్లు(1973) : ఇదే పాట ప్రతీ చోట ఇలాగే పాడుతుంటాను
ఒక నారి – వంద తుపాకులు(1973)
విచిత్ర వివాహం(భానుమతి తో) (1973)
నోము(1974) : కలిసే కళ్లలోన కురిసే పూలవాన
నేను – నా దేశం(1974) : నేను నా దేశం పవిత్ర భారతదేశం
నిప్పులాంటి మనిషి (1974) : స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం
నీడలేని ఆడది(1974) : తొలి వలపే తీయనిది
గౌరి (1974) : గలగల పారుతున్న గోదారిలా
మాఇంటి దేవుడు(1974)
గుండెలు తీసిన మొనగాడు(1974)
తులాభారం(1974) : రాధకు నీవేరా ప్రాణం
అమ్మాయి పెళ్లి(భానుమతి తో)(1974) : పాలరాతి బొమ్మకు నీ వగలెక్కడివి
రామయ్య తండ్రి(1975)
పుట్టింటి గౌరవం(1975)
అమ్మాయిలు జాగ్రత్త(1975)
సౌభాగ్యవతి(1975)
అనురాగాలు(1975)
నాకూ స్వతంత్రం వచ్చింది(1975)
రక్త సంబంధాలు(1975) : అనురాగ శిఖరాన ఆలయం
దేవుడే దిగివస్తే(1975)
పిచ్చోడి పెళ్ళి(1975)
తోట రాముడు(1975) : ఓ బంగరు రంగుల చిలకా పలుకవా
స్వర్గం నరకం(1975)
చిట్టెమ్మ చిలకమ్మ(1975)
ఈ కాలం దంపతులు(1975)
లక్ష్మణ రేఖ(1975)
బుల్లెమ్మ శపథం(1975)
మాయా మశ్చీంద్ర(1975) : ప్రణయరాగ వాహిని చెలీ వసంతమోహిని
ముత్యాల పల్లకి(1976) : సన్నజాజికి, గున్నమామికి పెళ్లి కుదిరింది, తెల్లావారకముందే పల్లె లేచింది
దొరలు దొంగలు(1976)
నేరం నాదికాదు – ఆకలిది(1976) : మంచిని సమాధి చేస్తారా ఇది మనుషులు చేసే పనియేనా
భలే దొంగలు(1976) : చూశానే ఓలమ్మీ చూశానే
పెద్దన్నయ్య(1976) : ఎటు చూసినా నీ బొమ్మే కనిపించింది
నిజం నిద్రపోదు(1976)
అదృష్టవంతురాలు(1976)
ఈ కాలపు పిల్లలు(1976)
భక్త కన్నప్ప(ఆదినారాయణరావు తో) (1976)
దేవుడు చేసిన బొమ్మలు(1976)
సీతమ్మ సంతానం(1977)
ప్రేమించి పెళ్ళి చేసుకో(1977)
అందమె ఆనందం(1977) : ఇదే ఇదే నేను కోరుకుంది...ఇలా ఇలా చూడాలని ఉం
ఒకే రక్తం(1977)
ఎదురీత(1977) : ఎదురీతకు అంతం లేదా, ఈ రాధ చివరకు ఏమైనా, తొలిసారి ముద్దివ్వమంది
ప్రేమలేఖలు(1977) : ఇది తీయని వెన్నెల రేయి
అమరదీపం(1977) : ఏ రాగమో ఇది ఏ తాళమో, నా జీవన సంధ్యా సమయంలో
జరుగుతున్న కథ(1977)
పెళ్లి కాని పెళ్లి(1977)
మనుషులు చేసిన దొంగలు(1977) : ఆనందం అబ్బాయిదైతే అనురాగం అమ్మాయిదైతే
తొలిరేయి గడిచింది(1977)
దొంగలకు దొంగ(1977) : ఈ రాతిరి ఓ చందమామా, పగడాల దీవిలో పరువాల చిలక
అల్లరి పిల్లలు(1978) : శ్రీచక్ర శుఖనివాస స్వామి జగమేలు చిద్విలాసా, నా రాశి కన్యరాశి, నా రాశి మిథునరాశి
కలియుగ స్త్రీ(1978)
నాయుడు బావ(1978)
నిండు మని(1978) : ఇంతటి సొగసే ఎదురుగా ఉంటే, ప్రేమించుకుందాం ఎవరేమన్న
అన్నదమ్ముల సవాల్(1978) : నా కోసమే నీవున్నది, నీ రూపమే నా మదిలోన తొలిదీపమై
ఏజెంట్ గోపి(1978) : ఓ పిల్లా కాచుకో, చిటపట చినుకుల మనకోసం కురిసాయి, హంస బలే రామచిలక ఓలమ్మీ
దొంగల దోపిడీ (1978)
ఖైదీ నెం: 77(1978)
గమ్మత్తు గూఢచారులు(1978)
కలియుగ సీత(1978)
ప్రేమ చేసిన పెళ్ళి(1978)
దొంగల వేట(1978)
చెప్పింది చేస్తా(1978)
రామచిలుక(1978) : రామచిలకా పెళ్ళికొడకెవరే
అంగడి బొమ్మ(1978) : అహో అందాలరాశి అహో అలనాటి ఊర్వశి
డూడూ బసవన్న(1978) : ముత్యాల కోనలోన రతనాల రామచిలక
రిక్షా రాజి (1978)
అడవి మనుషులు(1978)
లాయర్ విశ్వనాధ్(1978) : పిలిచె పిలిచె అనురాగం
తుఫాన్ మెయిల్ (1978)
చిలిపి చిట్టెమ్మ (1978)
మానవులు మమతలు(విడుదల కాలేదు) (1979)
ఇద్దరూ అసాధ్యులే (1979) : చినుకు చినుకు పడుతూ ఉంటే
వియ్యాలవారి కయ్యాలు(1979) : ఓ కలలోని ఊర్వశి, పాలుపొంగే వయసే నీది
ఐ లవ్ యూ (1979) : ఒక మాటుంది కలవరము రేపి
మూడు పువ్వులు ఆరు కాయలు(1979)
కోరికలే గుర్రాలైతే(1979) : కోరికలే గుర్రాలయితే ఊహలకే రెక్కలు వస్తే
ఏది పాపం? ఏది పుణ్యం?(1979) : కాలమిలా ఆగిపోనీ కలనిజమై సాగిపోనీ
కలియుగ మహాభారతం (1979)
రామబాణం (తెలుగు) (1979) : అమ్మ ప్రేమకు మారుపేరు
లక్ష్మీ పూజ (1979)
అల్లరి పిల్లలు(1979)
అందడు - ఆగడు(1979)
కార్తీక దీపం(1979) : ఆరనీకుమా ఈ దీపం కార్తీకదీపం, నీ కౌగిలిలో తలదాచి నీ చేతులలో కనుమూసి
పెద్దిల్లు చిన్నిల్లు(1979)
దొంగలకు సవాల్(1979)
ఛాయ(1979)
మా ఊళ్ళో మహాశివుడు(1979)
టైగర్(1979) : క్షణం క్షణం నిరీక్షణం
దశ తిరిగింది (1979)
సీతే రాముడైతే(1979)
మన ఊరి మారుతి(1979)
కొత్త కోడలు(1979)
భువనేశ్వరి(1979) : ఏమని పిలవాలి నిన్నేమని పిలవాలి
రతీ మన్మథ (1979)
నామాల తాతయ్య(1979
శ్రీ రామబంటు(1979)
ఆరని మంటలు(1980)
మహాలక్ష్మి(1980)
ధర్మచక్రం(1980)
నకిలీ మనిషి(1980)
ప్రేమ తరంగాలు(1980)
సీతారాములు (1980)
మూడు ముళ్ళ బంధం(1980)
రామాయణంలో పిడకల వేట(1980)
చండీప్రియ(1980)
కోడళ్ళొస్తున్నారు జాగ్రత్త(1980)
బంగారు బావ (1980)
రాముడు - పరశురాముడు(1980)
దేవుడిచ్చిన కొడుకు(1980)
మహాశక్తి(1980)
సుబ్బారాయుడు సుబ్బలక్ష్మి(1980)
కొంటె మొగుడు పెంకి పెళ్ళాం(1980)
చేసిన బాసలు(1980
రగిలే హృదయాలు(1980)
పెళ్ళి గోల(1980)
బడాయి బసవయ్య(1980)
స్వప్న (1980)
పార్వతీ పరమేశ్వరులు(1981)
తోడు దొంగలు(1981
ప్రేమ నాటకం (1981)
నాదే గెలుపు(1981)
గడసరి అత్త సొగసరి కోడలు(1981)
టాక్సీ డ్రైవర్ (1981)
నేను మా ఆవిడ(1981)
గిరిజా కళ్యాణం (1981)
ఘరానా గంగులు(1981)
అత్తగారి పెత్తనం(1981)
వాడని మల్లి(1981)
చందమామ రావే(1981)
సుబ్బారావుకి కోపం వచ్చింది(1981)
రహస్య గూఢచారి(1981)
పాలు నీళ్ళు(1981)
మధుర స్వప్నం(1982)
బంగారు కానుక(1982)
గృహ ప్రవేశం(1982)
తల్లీ కొడుకుల అనుబంధం(1982)
నిప్పుతో చెలగాటం(1982)
కృష్ణార్జునులు (1982)
కోరుకున్న మొగుడు (1982)
ప్రతిజ్ఞ(1982)
స్వయంవరం (1982)
చందమామ(1982)
పట్నం వచ్చిన పతివ్రతలు(1982)
ఎంత ఘాటు ప్రేమయో (1982)
పగబట్టిన సింహం(1982)
షంషేర్ శంకర్ (1982)
బిల్లా రంగా(1982)
సవాల్ (1982
కదిలి వచ్చిన కనకదుర్గ (1982)
మొండి ఘటం(1982)
ప్రేమ నాటకం(1982)
అగ్నిజ్వాల (1983)
పులిదెబ్బ (1983)
ధర్మ పోరాటం(1983)
కోడలు కావాలి(1983)
కుంకుమ తిలకం(1983)
అగ్ని సమాధి(1983)
ఆలయ శిఖరం(1983)
మరో మాయాబజార్(1983)
పల్లెటూరి పిడుగు(1983)
ఆంధ్రకేసరి (983)
సిరిపురం మొనగాడు (1983)
ఇకనైనా మారండి(1983)
చండీ చాముండీ(1983)
రోషగాడు(1983)
కలియుగ దైవం(1983)
పండంటి కాపురానికి 12 సూత్రాలు (1983)
రాకాసి లోయ(1983)
ధర్మాత్ముడు (1983)
కళ్యాణ వీణ(1983)
రుద్రకాళి (1983)
మూగవాని పగ (1983)
పద్మవ్యూహం(1984)
మహానగరంలో మాయగాడు(1984)
గృహలక్ష్మి(1984)
ఆగ్రహం(1985
ఆలయ దీపం(1985)
ఋణానుబంధం(1985)
ఇద్దరు మిత్రులు(1985)
అనాదిగా ఆడది(1986)
జీవనరాగం(1986)
కారు దిద్దిన కాపురం(1986)
అర్ధరాత్రి స్వతంత్రం(1986)
తలంబ్రాలు(1986)
మామా కోడళ్ళ సవాల్(1986)
సన్న జాజులు(1986)
ప్రేమ సామ్రాట్(1987)
అన్నపూర్ణమ్మగారి అల్లుడు(1987)
భలే మొగుడు(1987)
ఆహుతి(1988)
ఆగష్టు 15 రాత్రి(1988)
శ్రీరామచంద్రుడు(1989)
అంకుశం(1990)
If you listen to songs like:
kurisindi vaana naa gunDe lOna...
idi teeyani vennela rEyi, madi vennela kannaa haayi...
toli saari muddivvamandi...
E divilO virisina paarijaatamO...
madhumaasa vELalO...
gaalivaanalO vaananeeTilO paDava prayaaNam...
idE naa modaTi prEmalEkha...
aaraneekumaa ee deepam kaarteekadeepam...
EskO Coca Cola, teeskO rum, saaraa...
and a lot more songs that one can keep on listing to make the point on the versatile talent of music director Satyam. Though his full name is Chellapilla Satyam, people know him as just "Satyam" or some remember him more as 'Dholak' Satyam.Rajasekhar-starrer Ankusham in 1989 was one of his last films. He is considered one of the top music directors not only in Telugu but also in Kannada in 1970s. Though he left the physical world on January 11, 1989, his music will be there forever! May his soul rest in peace.
 

Bhajans

Kids Telugu Rhymes

Private & Folk Songs