సినీరచయితగా ఆయనకది తొలిపాట.......
అది N T R, Jamuna ల వంటి సీనియర్ నటులకు చెందిన పాట
ఆ పాట రాసే అవకాశం ఎలా వచ్చిందో దాని వెనుక కథ ఏమిటో
C.Narayana Reddy గారి మాటలలో.
అందరి మదినీ దోచింది
'రెడ్డి గారూ............మీ గురుంచి విన్నాం. మేం త్వరలో తీయబోతున్నచిత్రానికి అన్ని పాటలూ మీరే రాయాలి. ఏమంటారు?' - అన్నారు N T R గారు.
నేను హైదరాబాద్ నిజాం కళాశాలలో అద్యాపకుడిగా పనిచేస్తున్న రోజులవి. యన్. టి. ఆర్ 'కలసి ఉంటే కలదు సుఖం' చిత్రంలో నటిస్తున్నారు. మిత్రులు P.S.Prasad గారితో నాకు కబురు పెడితే వెళ్లి కలిశాను. 'గులేబకావళి కథ' చిత్రానికి పాటలు రాయమని అడిగారు. ఆ క్షణం చాలా ఆనందం కలిగింది. కానీ, ఓ చిన్న సందేహం. ఆ చిత్రానికి మాటలూ పాటలూ సముద్రాల(Jr) రాస్తున్నట్లు అంతకుముందే పత్రికల్లో చదివాను. అదే విషయం N T R గారి ముందు ప్రస్తావించా. 'ముహూర్తం కోసం ఆయనతో ఓ పద్యం రాయించి రికార్డింగ్ చేశాము. ఈ చిత్రానికి పది పాటలు మీరే రాయాలి.వీలు చూసుకుని Madras రండి' అన్నారాయన. నా సినీరంగ ప్రవేశానికి అలా ముహూర్తం ఖరారైంది. 1960, March 10 అనుకుంటా.............Hyderabad నుంచి Madras కి రైలులో బయలుదేరాను.
మరచిపోలేను
Madras స్టేషన్ లో దిగాను. .........ఆశ్చర్యం! అప్పటికే సినీరంగంలో పెద్దతారగా వెలుగుతున్న N T R
నన్ను కలుసుకోవడానికి వచ్చారు. ఆయనతో పాటు వారి సోదరులు, నిర్మాత Trivikrama Rao గారు, Gummadi, Mikkilineni ఉన్నారు. నన్ను ఎంతో ఆప్యాయంగా పలకరించి కారు దగ్గరకి తీసుకెళ్ళారు. ' రెడ్డిగారూ ..............ఇది నా సెంటిమెంటు కారు. మనం దీనిలోనే వెళ్దాం' అంటూ సరాసరి వారింటికి తీసుకెళ్ళారు. ఆయన సతీమణి బసవతారకం గారికి నన్ను పరిచయం చేశారు. N. A.T సంస్థ కార్యాలయం లో నాకో గది ఇచ్చారు. Gulebhakavali కథ స్క్రిప్ట్ నా చేతికిచ్చారు. 'ఇది చదవండి. పాటల సందర్భాల పూర్వాపరాలు మీకు తెలుస్తాయి' అన్నారు. ఆరోజే పాటల రచన, స్వరకల్పన ప్రారంభమైంది. అప్పటికే కొన్ని సినిమాలకు సంగీతం అందించిన Veluri Krishna Murthy గారు, పాశ్చాత్య సంగీతంలో నిపుణులు Joseph గారు.............వీళ్లిద్దరు ఆ సినిమాకు సంగీత దర్శకులు. మొదట నేనో పల్లవి రాశాను. అది N T R గారికి చూపించాను. ఆయనకు నచ్చింది. ఆపై మంచి బాణీ కుదిరింది. అదే రోజు రెండు పాటలు రాశాను. ఒకటి ......'నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని'. రెండోది..............'కలల అలలపై తేలెను మనసు మల్లెపూవై.' ఈ రెంటిలో మొదటిదిగా రికార్డింగ్ అయింది. 'నన్ను దోచుకుందువటే'............... అదే నా తొలి సినీ గీతం. ఈ పాట మొత్తం రాసేసి N T R కి చూపించాను. ఆయన అందులో ఒక్క పదం కూడా మార్చాలని సూచించలేదు.
అదే అందం
పాట రాయడం అయిపోయాక ఓ చిన్న సందేహాన్ని వెలిబుచ్చారు మిత్రులు. ఇందులో 'నా మదియే
మందిరమై నీవే ఒక దేవతవై' అని నాయిక పాడుతుంది. నాయకుణ్ణి 'దేవత' అనడం ఎంతవరకూ సమంజసం అనీ. మనం ముక్కోటి దేవతలు అంటాం. అంటే అందులో ఆడ, మగ దేవతలు ఉన్నట్టే కదా. కాబట్టి ఆ పదాన్ని మగకూ ఆడకూ వాడొచ్చనేది నా భావన. దాంతో ఆందరూ ఏకీభవించారు. ఆపై నేను రాసిన తొలి పాట మధుర గాయకుడు Ghantasala, గాయని P.Susheela పాడటం నా అదృష్టం. ఇక , తెరపైకి వచ్చేసరికి N T R, Jamuna ల అభినయం ఆ పాటకు ప్రాణం పోసింది. ఇవన్ని కలిసొచ్చాయి కాబట్టే ఆ పాట ఇప్పటికి మధురం. రాసే అవకాశం రావడం నా అదృష్టం.
ఎంత ఆదరణ
Madras లో ఉన్న ఆ పది రోజులూ N T R నన్ను ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారు. రోజూ వారింట్లోనే
ఆయనతోనే భోజనం. ఆ తరువాత ఓ విందు కార్యక్రమంలో A N R గారిని కలుసుకున్నాను. ఆయన 'రెడ్డిగారు ...........మిమ్మల్ని ముందుగా ఆహ్వానించలేకపోయాం. ఆ పని N T R గారు చేశారు. పాటల రచయితగా మున్ముందు మీరు ఎంతో ఎంతో బిజీ అయిపోతారు చూడండి" అన్నారు . అక్షరాల ఆ మాటలే నిజమయ్యాయి. ఇదంతా N T R నన్ను సినీరంగానికి పరిచయం చేసిన వేలావిశేషంగానే భావిస్తాను.
పాటకచేరి
పల్లవి:
అతను:
నన్ను దోచుకుందువటే వన్నెల దొరసానీ
ఆమె: కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామీ నిన్నే నా స్వామీ
అ: నన్ను దోచుకుందువటే....
చరణం1:
ఆ: తరియున్తును నీ చల్లని చరణమ్ముల నీడలోన పూలదండవోలె_కర్పూర కళికవోలె కర్పూర కళికవోలె
అ:ఎంతటి నెరజానవో నా అంతరంగమందు నీవు కలకాలము వీడని సంకెలలు వేసినావు
11నన్ను11
చరణం:2
ఆ: నా మదియే మందిరం నీవే ఒక దేవతవై వెలసినావు నాలో నే కలసిపోదు నీలో కలసిపోదు నీలో
అ: ఏనాటిదో మన బంధం ఎరుగరాని అనుబంధం ఎన్నియుగాలైనా యిది యిగిరిపోని గంధం
11నన్ను11