
బ్రహ్మానందం అహనపెళ్ళంట చిత్రం సంగతులు. పిసినారితనానికి పరాకాష్టగా నిలిచిన కోట శ్రీనివాస రావు ...... ఆయన దగ్గర పావలాకు పనిచేసే బ్రహ్మానందం. ఈ చిత్రం వెనుక అనేక సంగతులు ఉన్నాయి. ఈ పాత్రలకు ముందుగా
లక్ష్మీపతి పాత్రకు
రావు గోపాల రావును,
గోవిందం పాత్రకు
సుత్తివేలు అయితే బావుంటుందని
జంధ్యాల గారు భావించారు.

అయితే రావు గోపాల రావు అయితే కథ మరోల ఉంటుందని జంధ్యాల గారు భావించారు. సుత్తివేలు చాలా బిజీ గా ఉన్నారు . అప్పటికి బ్రహ్మానందం 4, 5 చిత్రాలలో నటించి అత్తిలిలో ఉద్యోగం చేసుకుంటున్నారు.'సత్యాగ్రహం' లోబ్రహ్మానందం చేసిన పాత్రను రామానాయుడు గుర్తుపెట్టుకొని అరగుండు పాత్రలో బ్రహ్మానందాన్ని ఎంపిక చేసారు. ఈ చిత్రం విడుదల అయ్యాక పోస్టరుని చూదతానికి అత్తలి నుండి తాడేపల్లిగూడెం వరకు వెళ్ళేవారు. ఈ చిత్రం కు బ్రహ్మానందం అందుకున్న డబ్బులు 5 వేలు. అరగుండు పాత్ర చేయలేక పోయిన సుత్తివేలు పిసినారి సంఘం అధ్యక్షులుగా కనిపిస్తారు.