Social Icons

Pages

S. P. Kodandapani(1932 - 1974) - Music Director


ఎస్.పి.కోదండపాణి (1932 - 1974) సుప్రసిద్ధ తెలుగు సినిమా సంగీత దర్శకులు. వీరి పూర్తిపేరు శ్రీపతి పండితారాధ్యుల కోదండపాణి. వీరు ఇదిగో దేవుడు చేసిన బొమ్మ వంటి కొన్ని పాటలు పాడారు కూడా.
జీవిత విశేషాలు:
ఇతను 1932 వ సంవత్సరంలో గుంటూరులో జన్మించారు. అతని బాల్యం గుంటూరులో గడిచింది. ఇతను 9 వ తరగతి వరకు ఆ ఊరులోనే చదువుకున్నాడు. చిన్నప్పుడు పద్యాలు, పాటలు పాడటం, సంగీతం, హార్మోనియం నేర్చుకున్నారు. అద్దేపల్లి రామారావు గారి నా ఇల్లు చిత్రంలో బృందగానంలో మొదటి సారిగా 1953లో సినిమాలలో పాడే అవకాశం కలిగింది. సుసర్ల దక్షిణామూర్తి గారి వద్ద హార్మోనిస్టుగాను, సహాయకులుగా పనిచేశారు. 1955లో సంతానం చిత్రం ద్వారా స్వతంత్రంగా పాటపాడే అవకాశం లభించింది. ఆ తరువాత కె.వి. మహదేవన్ వద్ద ఐదేళ్ళు బాధ్యతలు నిర్వహించి ఎన్నో మెళకువలు తెలుసుకోగలిగారు.హాస్యనటులు పద్మనాభం రేఖా అండ్ మురళీ ఆర్ట్స్ సంస్థ పేరుతో నాటకాలు ప్రదర్శించేవారు. వారికి సంగీత దర్శకులుగా సేవలందించారు. అక్కడ సంపాదించిన కీర్తి ప్రతిష్టల వల్ల 1961లో కన్నకొడుకు (1961) చిత్రానికి సంగీత దర్శకులయ్యారు. తరువాత పదండి ముందుకు (1962), మంచి రోజులొచ్చాయి, బంగారు తిమ్మరాజు, తోటలో పిల్ల కోటలో రాణి, లోగుట్టు పెరుమాళ్ళకెరుక మొదలైన చిత్రాలకు పనిచేశారు. తాను సంగీతం చేకూర్చే ప్రతి పాట శ్రావ్యంగా ఉండాలని, సాహిత్య విలువ దెబ్బతినకూడదని భావించేవారు. ఈయన మొత్తం 101 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. ఇతను చిన్న వయసులోనే 42 సంవత్సరాలకే (5 ఏప్రిల్ 1974) న చనిపోయారు.పద్మనాభం గారి శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రం ద్వారా వీరు 1967లో ఈనాటి ఉత్తమ గాయకులు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ను తెలుగు తెరకు పరిచయం చేశారు.

Family Details:

Kodandapani garu was one of 5 children of SP Nandyayya.

The first one was S.P.Nagabhushanam, Second, S.P.Radhakrishna, then S.P.Kodandapani and then S.P Venkannababu. They have a sister who used to stay in Manthinavari palem near Guntur and she too passed away recently.

Nagabhushanam garu was not connected to the industry...But his son S.P.Ramakrishna is a leading make up man in Chennai.

Radhakrishna garu started a film magazine in 1960's...I guess one of the first...and later produced too and started a big chemical industry.

Then Kodandapani garu...All know about his films...His son SP.Easwar is a successful Music director in Chennai and does a lot of TV work.

Then SP Venkanna Babu garu, He produced many movies with Krishna, Chiranjeevi, Rajendraprasad etc. He is survived by his wife and 3 children, all not connected to the Industry.

చిరకాలం గుర్తుండే పాటలు:
బొమ్మను చేసి ప్రాణం పోసి - దేవత
ఇది మల్లెల వేళయనీ - సుఖదుఃఖాలు
జగమే రామమయం - శ్రీరామకథ
చుక్కలన్ని చూస్తున్నాయీ - జ్వాలాద్వీప రహస్యం
చిత్రాలు:
పండంటి కాపురం (1972) (సంగీత దర్శకుడు మరియు నేపథ్య గాయకుడు)
తాతా మనవడు (1972)
బస్తీ బుల్ బుల్ (1971)
కథానాయిక మొల్ల (1970)
గోపాలుడు భూపాలుడు (1969)
మంచి మిత్రులు (1969)
శ్రీ రామ కథ (1969)
పేదరాశి పెద్దమ్మ కథ (1968)
నేనంటే నేనే (1968)
భలే మొనగాడు (1968)
అగ్గిమీద గుగ్గిలం (1968)
మంచి కుటుంబం (1968)
రణభేరి (1968)
సత్యమే జయం (1967)
శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న (1967)
ఇద్దరు మొనగాళ్లు (1967)
గోపాలుడు - భూపాలుడు (1967)
భూలోకంలో యమలోకం (1966)
లోగుట్టు పెరుమాళ్ళు కెరుక (1966)
పొట్టి ప్లీడరు (1966)
ఆటబొమ్మలు (1966)
ఆకాశ రామన్న (1965)
కథానాయకుడి కథ (1965)
పక్కలో బల్లెం (1965)
దేవత (1965)
జ్వాలాదీప రహస్యం(1965)
కీలు బొమ్మలు (1965)
తోటలో పిల్ల - కోటలో రాణి (1964)
బంగారు తిమ్మరాజు (1964)
మంచి రోజులు వస్తాయి (1963)
గురువును మించిన శిష్యుడు (1963)
ఏకైక వీరుడు (1962)
పదండి ముందుకు (1962)
విప్లవ వీరుడు (1961)(తమిళం డబ్బింగ్)
కన్నకొడుకు (1961)
సంతానం (1955) (సహాయ సంగీత దర్శకుడు మరియు నేపథ్య గాయకుడు)
 

Bhajans

Kids Telugu Rhymes

Private & Folk Songs