
చిత్రం : టాక్సీ రాముడు (1961)
రచన : మల్లాది రామకృష్ణ మూర్తి
సంగీతం : టి. వి. రాజు
గానం : ఘంటసాల & సుశీల
పల్లవి:
ఆమె :రావోయి .... రావోయి మనసైన రాజా (2)
అతడు : ఎవరో బాలా ననుగోరు అందాల బాలా
అనువైన అనురాగమాలా
ఎవరో బాలా.......
చరణం:
ఆమె: చిరుగాలి తేలే రేరాణిని
కలలేలజాలే నీ రాణిని (2)
అతడు: రేరాణి నిగనిగ రేరాజుకే
నా రాణి వగలెల్ల నాకోసమే (2)
ఆమె: మనసైన రాజా
అతడు : అందాల బాలా
ఆమె: మనసార దరిచేరి మురిపించవా //రావోయి//
చరణం :
అతడు: గగనాన తార జగమేలగా
నీ వాలు కనులూ నన్నేలగా (2)
ఆమె: నిన్నేలు వాలు కన్ను మీటైనదే
కవ్వించు కన్నె నవ్వు నిండైనదే (2)
అతడు : నగుమోము దానా
ఆమె: వగలేలనోయీ
అతడు : వగలైన వలపైన నీ మీదనే //రావోయి//