
చిత్రం : మరో ప్రపంచం(1970)
రచన : శ్రీశ్రీ
సంగీతం : మహదేవన్
గానం : బాలు & జానకి
పల్లవి: ఇదుగో ఇదుగో ప్రపంచం
ఇది ఎంతో వింత ప్రపంచం
మనిషికోసమై మనిషే చేసిన
మహామంచి ప్రపంచం
ఓహో హోయ్ మాయదారి ప్రపంచం //ఇదుగో//
చరణం1: కలిసిమెలిసి మనిషీ పశువూ సావాసం చేసే లోకం
కళ్లుమూసి తెరిచేలోగా జనాభాలు పెరిగే లోకం
పాపాయికి పాలో అంటే పాపానికి లాగే లోకం
రూపాయలు వెదకాలంటూ దీపాలను ఆర్పేలోకం
చిరిగిన విస్తరి మెతుకులతో
అతుకుల బొంతల బ్రతుకులతో
పేదలకోసం ధనికులు కట్టిన //మహామంచి// //ఇదుగో//
చరణం 2: ప్రాజెక్టుల వాగ్దానాలు మిగిలేవే పునాదిరాళ్లు
అభయానికి ఎత్తిన చెయ్యి అందరికీ నెత్తిన చెయ్యి
ధరించేది కాషాయం దూరేదే కల్లు దుకాణం
జపించేది తారక మంత్రం పీల్చేదే పేదల రక్తం
ప్రజలాశించిన సురలోకం ప్రభువులు తెచ్చిన యమలోకం
మన గాంధీజీ కమ్మని కలలే మసిచేసిన ప్రపంచం
ఓహో హోయ్ మాయదారి ప్రపంచం //ఇదుగో//
చరణం 3: పదవులకై బడిపిల్లలనే భస్మాసురలను చేసే లోకం
పంతానికి తమ సంపదనే పాడుపెట్టి మురిసే లోకం
శ్రమజీవుల వ్యవసాయంతో సోమరులే బలిసే లోకం
ధనరాసుల గుణకారంతో దారిద్ర్యం పెరిగే లోకం
ఆకసమంటే మేడలతో
ఆకలిమంటల పీడలతో
ఇది ధనికుల కోసం పేదలు కట్టిన //మహామంచి// //ఇదుగో//