పాట : రాక రాక వచ్చావు చందమామ
చిత్రం : అర్ధాంగి (1955)
గానం : జిక్కి
రచన : ఆత్రేయ
సంగీతం : బి. నరసింహా రావు - అశ్వథామ
పల్లవి :
రాక రాక వచ్చావు చందమామా (2)\
లేక లేక నవ్వింది కలువభామా .......... కలువభామా // రాక రాక//
చరణం 1:
మబ్బులన్ని పోయినవి మధుమాసం వచ్చినది (2)
మరులుకొన్న విరికన్నె విరియబూచి మురిసినది (2)
విరియబూచి మురిసినదీ ............
లేక లేక నవ్వింది కలువభామా .......... కలువభామా
చరణం 2:
రేకులన్ని కన్నులుగా లోకమెల్ల వెదికినది (2)
ఆకసాన నిను చూచి ఆనందం పొంగినది (2)
ఆనందం పొంగినదీ..........
లేక లేక నవ్వింది కలువభామా .......... కలువభామా
చరణం 3:
తీరని కోరికలే తీయని తేనియలై
తీరని కోరికలే తియ్య తీయని తేనియలై
వెన్నెలలో కన్నులలో వెల్లివిరిసి మెరసినవి (2)
దొంగలాగ దూరన తొంగిచూతువేలా ...........
తొంగిచూతువేలా
రావోయి రాగమంత నీదోయి ఈ రేయి .......... // రాక రాక//