చల్లని వెన్నెలలో
చల్లని వెన్నెలలో....... చక్కని కన్నె సమీపములో
అందమే నాలో లీనమాయెనే........ ఆనందమె నా గానమాయెనే
తెలి మబ్బుల కౌగిలిలో జాబిలి......... తేలియాడెనే ముద్దులలో //తెలి//
గాలి పెదవులే మెల్లగ సోకిన......... పూలు నవ్వెనే నిద్దురలో........
//చల్లని//
కళకళలాడే కన్నె వదనమే......... కనిపించును ఆ తారలలో
ఓ....... ఓ..... ఓ.... //కళకళ//
కలకాలం నీ కమ్మని రూపము.......... కలవరింపులే నా మదిలో.......
//చల్లని//
మాధుర్యం చిలికే ఈ పాట (5 - 8 - 1955) 60 సంవత్సరముల క్రితం విడుదలైన సంతానం చిత్రంలోనిది. వెన్నెల, చందమామ(జాబిలి), ఆకాశం(మబ్బుల), తారలు, మలయా నిలయం, మల్లెల పరిమళం వంటి పదాలను వాడి అనిశెట్టి రాసిన ఈ గీతానికి సుసర్ల దక్షిణమూర్తి సంగీతం సమకూర్చారు.
ఇది కళ్యాణిరాగమునకు సంబంధించిన అద్భుతమైన పాట. ఆలాపన ఎంతో సంక్లిష్టంగా సాగుతుంది. సినీ సంగీతంలో సుసర్లది ఒక ప్రత్యేక అధ్యాయం.