పాట : చేతిలో చెయ్యేసి చెప్పు బావా
చిత్రం : దసరా బుల్లోడు
సంవత్సరం : 1971
గానం : ఘంటసాల & పి. సుశీల
రచన : ఆత్రేయ
సంగీతం : కె. వి. మహదేవన్
పల్లవి :
చేతిలో చెయ్యేసి చెప్పు బావా //చేతిలో//
చేసుకున్న బాసలు చెరిగీ పోవనీ మరచీపోననీ //చేతిలో//
చేతిలో చెయ్యేసి చెప్పు రాధా
చెప్పుకున్న ఊసులు మాసిపోవనీ మారీపోననీ //చేతిలో చెయ్యేసి//
చేతిలో చెయ్యేసి చెప్పు బావా
పల్లవి :
చేతిలో చెయ్యేసి చెప్పు బావా //చేతిలో//
చేసుకున్న బాసలు చెరిగీ పోవనీ మరచీపోననీ //చేతిలో//
చేతిలో చెయ్యేసి చెప్పు రాధా
చెప్పుకున్న ఊసులు మాసిపోవనీ మారీపోననీ //చేతిలో చెయ్యేసి//
చేతిలో చెయ్యేసి చెప్పు బావా
చరణం:
పాడుకున్న పాటలు పాతబడిపోవనీ
చిలిపిగ ఆడుకున్న ఆటలకు అలుపు రానివ్వననీ //పాడుకున్న//
పడుచు గుండె బిగువులు సడలిపోనివ్వననీ //పడుచు//
దుడుకుగ ఉరికిన పరువానికి ఉడుకు తగ్గిపోదనీ
చేతిలో చెయ్యేసి చెప్పు బావా
చెప్పుకున్న ఊసులు మాసిపోవనీ మారీపోననీ
చేతిలో చెయ్యేసి చెప్పు రాధా
చరణం 2:
కన్నెగా కన్న కలలు కథలుగా చెప్పాలి
మన కథ కలకాలం చెప్పినా కంచి కెళ్లకుండాలి //కన్నెగా//
మన జంట జంటలకే కన్ను కుట్టు కావాలి //మన జంట//
ఇక ఒంటరిగా ఉన్నవాళ్లు జంటలై పోవాలి //చేతిలో//