పాట : నిన్నటి దాకా శిలనైన
చిత్రం : మేఘసందేశం(1982)
గానం : పి. సుశీల
సంగీతం : రమేష్ నాయుడు
రచన : వేటూరి
పల్లవి :
నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకి నే గౌతమినైనా
నిన్నటిదాకా శిలనైనా నీ మమతా వేశపు వెల్లువలో
గోదారి గంగనై పొంగుతూ ఉన్నా.......... //నిన్నటిదాకా//
చరణం :
సరస సరాగాల సుమరాణిని స్వరస సంగీతాల సారంగిణి

మువ్వ మువ్వకు ముద్దు మురిపాలు పలుక //మువ్వ//
మవ్వంపు నటనాల మాతంగిని
కైలాస శిఖరాగ్ర శైలూశిఖా
నాట్య డోలలూగేవేళ రావేల నన్నేల //నిన్నటిదాకా//
చరణం :
నిన్నే ఆరాధించు నీ దాసిని ప్రేమ ప్రాణాలైన ప్రియురాలిని

పువ్వు పువ్వుకు నవ్వు నవకాలు తెలిపే //పువ్వు//
చిరునవ్వులో నేను సిరిమల్లిని
స్వప్న ప్రపంచాల సౌందర్య దీపాలు
చెంత వెలిగేవేళ ఈ చింత నీకెల //నిన్నటిదాకా//