పాట : ఎన్నెన్నో జన్మల బంధం
చిత్రం : పూజ
సంవత్సరం: 1975
రచన: దాశరథి
గానం : బాలు & వాణీ జయరాం
సంగీతం : రాజన్ - నాగేంద్ర
పల్లవి :
ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ......ఎన్నటికీ మాయని మమత నాదీ నీదీ
ఒక్కక్షణం నిను వీడి నేనుండలేను........ ఒక్కక్షణం నీ విరహం నే తాళలేను
//ఎన్నెన్నో //
చరణం 1:
పున్నమి వెన్నెలలోన పొంగును కడలి... నిన్నే చూసిన వేళ నిండును చెలిమి
ఓహోహోహో.... నువ్వు కడలివైతే నే నదిగా మారి
చిందులు వేసి వేసి నిన్ను చేరనా....... చేరనా........ చేరనా ........
//ఎన్నెన్నో //
చరణం 2:
విరిసిన కుసుమము నీవై మురిపించేవు... తావిని నేనై నిన్ను పెనవేసేను
ఓహోహోహో....మేఘము నీవై నెమలిని నేనై
ఆశతో నిన్ను చూసి చూసి ఆడనా...... ఆడనా ........ ఆడనా ........
//ఎన్నెన్నో //
కోటి జన్మలకైనా కోరేదొకటే.... నాలో సగమై ఎప్పుడూ నీవుండాలి
ఓ హో హో హో... నీ వున్న వేళ ఆ స్వర్గమేలా
ఈ పొందు ఎల్లవేళలందు ఉండనీ...... ఉండనీ....... ఉండనీ.........
//ఎన్నెన్నో //