పాట : నన్ను ఎవరో తాకిరి
చిత్రం : సత్తెకాలపు సత్తయ్య
సంవత్సరం : 1969
రచన : ఆరుద్ర
సంగీతం : యం. యస్. విశ్వనాథన్
గానం : ఘంటసాల & సుశీల
పల్లవి : నన్ను ఎవరో తాకిరి ... కన్ను ఎవరో కలిపిరి
చూపులోనే ఆపలేని మత్తుమందూ చల్లిరి //నన్ను//
నన్ను ఎవరో చూచిరి .... కన్నెమనసె దోచిరి
చూపులోనే ఆపలేని మత్తుమందూ చల్లిరి //నన్ను//
చరణం 1 : ఆ బుగ్గల లేతసిగ్గు నా కోసం పూచినదేమో //2//
సిగ్గులన్నీ దోచుకుంది తొలివలపే ఎంత హాయి
ఆ మగసిరి అల్లరియంతా నా కోసం దాచినదేమో //2//
అందగాడు ఆశపెట్టె సయ్యాటలు ఎంత హాయి
//నన్ను//
చరణం 2: ఆ నల్లని జడలో మల్లెలు నాకోసం నవ్వినవేమో //2//
మల్లెలాగ నేను కూడ జడలోనే ఉంటే హాయి
ఆ చల్లని కన్నుల కాంతి నాకోసం వెలిగినదేమో //2//
కాంతి లాగ నేను కూడ ఆ కన్ను నిలిపినచాలు
//నన్ను//