పాట : సన్నజాజులోయ్
చిత్రం : సింహబలుడు
సంవత్సరం : 1978
రచన : వేటూరి
సంగీతం : యం. యస్. విశ్వనాథన్
గానం : బాలు & ఎల్. ఆర్ . ఈశ్వరి
పల్లవి : సన్నజాజులోయ్ కన్నెమోజులోయ్...... //2//
అల్లిబిల్లి సంతలోన పిల్లగాలి జాతరాయె తళుకు బెళుకు కనవేరా
పాలవెల్లి పుంతకాడ పైటకొంగు జారిపోయె పడుచు గొడవ వినవేరా
సన్నజాజులోయ్ కన్నెమోజులోయ్......
కన్నుకన్ను గీటుకుంటే సన్నసన్న మంటరేగే కలికి చిలుకు ఇటురావే
ఒళ్లు ఒళ్లు మీటుకుంటే వగలమారి సెగలు పుట్టె వలపు పిలుపు వినిపోవే

చరణం 1 : బానిసగా వచ్చావు నన్నే నీ బానిసగా చేసుకున్నావు
మగతనం చూపావు నాలో ఆడతనాన్ని నిద్రలేపావు
రేయి తెల్లారి చల్లారి పోతుందిరా రారా సుందరా
ఒకటున్నది నీలో ఒడుపున్నది నాలో
అది ఉన్నది లేనిదీ తెలుసుకో
మెరుపున్నది నాలో ఉరుమున్నది నీలో
అది నీదనీ ఇది నాదని మరచిపో //సన్నజాజులోయ్//

చరణం 2: ఈ ద్వీపానికి దీపానికి నువ్వు ఈ లంకకే నెలవంక నువ్వు
మల్లెపువ్వంటి రవ్వంటి మనసుందిలే మగతోడుందిలే
చింత చిగురంటి పొగరుంది వగరుందిలే సెగరేగిందిలే
వలపున్నది నాలో వలపున్నది నీలో
ఆ పట్టు ఈ విడుపు నీ కోరుకో
సగమున్నది నాలో సగమున్నది నీలో
రెంటినీ జంటగా మలచుకో //సన్నజాజులోయ్//