పాట : ఏ కులము నీదంటే
చిత్రం : సప్తపది
రచన : వేటూరి
గానం : బాలు & జానకి
సంగీతం : కె. వి. మహదేవన్
పల్లవి:
ఏ కులము నీదంటే గోకులము నవ్వింది
మాధవుడు యాదవుడు మా కులమే లెమ్మంది
//ఏ కులము//
చరణం 1:
ఏడు వర్ణాలు కలిసి ఇంద్రధనస్సు అవుతాది
అన్ని వర్ణాలకు ఒకటే ఇహము పరము ఉంటాది
// ఏడు వర్ణాలు//
ఏ కులము నీదంటే గోకులము నవ్వింది
మాధవుడు యాదవుడు మా కులమే లెమ్మంది
చరణం 2:
ఆది నుంచి ఆకాశం మూగది
అనాదిగా తల్లి ధరణి మూగది //ఆది నుంచి//
నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు //నడుమ//
ఈ నడమంత్రపు మనుషులకే మాటలు
ఇన్ని మాటలు
ఏ కులము నీదంటే గోకులము నవ్వింది
మాధవుడు యాదవుడు మా కులమే లెమ్మంది