పాట : విన్నపాలు వినవలె
చిత్రం : అన్నమయ్య
గానం : బాలు, రేణుక & ఎం. ఎం. శ్రీలేఖ
సంగీతం : ఎం. ఎం. కీరవాణి
విన్నపాలు వినవలె వింతవింతలు (2)
పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్యా
//విన్నపాలు //
కంటి శుక్రవారము గడియా లేడింట
అంటి అలమేలుమంగ అండనుండే స్వామిని
//కంటి//
పిడికిట తలంబ్రాల పెండ్లికూతురు
కొంత పెడమరలి నవ్వీనీ పెండ్లికూతురు
//పిడికిట//
పేరుగల జవరాలి పెండ్లికూతురు
పెద్దపేరున ముత్యాల మెడ పెండ్లికూతురు
పేరంటాడ్ల నడిమి పెండ్లికూతురు (2)
విభు పేరు గుచ్చ సిగ్గుపడి పెండ్లికూతురు
అలర చంచలమైన ఆత్మనందుండ
నీ అలవాటు సేసెనీ ఉయ్యాల
//అలర//
పలుమారు ఉఛ్వ్వాస పవనమందుండ
నీ భావమ్ము తెలిపెనీ ఉయ్యాల
//పలుమారు//
ఉయ్యాల......... ఉయ్యాల........ (4)
పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్యా
//విన్నపాలు //
కంటి శుక్రవారము గడియా లేడింట
అంటి అలమేలుమంగ అండనుండే స్వామిని
//కంటి//
పిడికిట తలంబ్రాల పెండ్లికూతురు
కొంత పెడమరలి నవ్వీనీ పెండ్లికూతురు
//పిడికిట//
పేరుగల జవరాలి పెండ్లికూతురు
పెద్దపేరున ముత్యాల మెడ పెండ్లికూతురు
పేరంటాడ్ల నడిమి పెండ్లికూతురు (2)
విభు పేరు గుచ్చ సిగ్గుపడి పెండ్లికూతురు
అలర చంచలమైన ఆత్మనందుండ
నీ అలవాటు సేసెనీ ఉయ్యాల
//అలర//
పలుమారు ఉఛ్వ్వాస పవనమందుండ
నీ భావమ్ము తెలిపెనీ ఉయ్యాల
//పలుమారు//
ఉయ్యాల......... ఉయ్యాల........ (4)