పాట : ఈనాడే ఏదో అయ్యింది
చిత్రం : 1989
రచన : ఆత్రేయ
సంగీతం : ఇళయరాజా
గానం : బాలు & చిత్ర
పల్లవి:
ఈనాడే ఏదో అయ్యింది .... ఏనాడూ నాలో జరగనిది
ఈ అనుభవం మరల రానిది
ఆనంద రాగం మోగింది .... అందాలలోకం రమ్మంది //ఈనాడే//
చరణం 1:
నింగీ నేల ఏకంకాగా ఈ క్షణమిలాగే ఆగింది (2)
ఒకటే మాటన్నదీ ఒకటైపొమ్మనదీ
మనసే ఇమ్మన్నదీ అది నా సొమ్మన్నదీ
పరువాలు మీటి నననన సెలయేటి తోటి నననన
పాడాలి నేడు నననన కావాలి తోడు //ఈనాడే//
చరణం 2:
సూర్యుని మాపి చంద్రుని ఆపి వెన్నెల రోజంతా కాచింది (2)
పగలూ రేయన్నదీ అసలే లేదన్నదీ
కలలే వద్దన్నదీ నిజమే కమ్మన్నదీ
ఎదలోని ఆశ నననన ఎదగాలి బాసై నననన
కలవాలి నీవు నననన కరగాలి నేను నననన //ఈనాడే//