Social Icons

Pages

Old Telugu Music - Nenu Neekai Puttinanani - Song Lyric

పాట : నేను నీకై  పుట్టినాననీ 
చిత్రం : చంటబ్బాయ్ 
సంవత్సరం : 1986
రచన :  వేటూరి 
సంగీతం : చక్రవర్తి 
గానం : బాలు & సుశీల 

పల్లవి:
నేను నీకై పుట్టినాననీ ... నిన్ను పొందకా మట్టికాననీ 
చెమ్మగిల్లే కనులతో ... చేయి పట్టే మనసుతో 
చేసుకున్న బాసలూ ఊసులే ప్రేమ .. ఊపిరే ప్రేమ ...... 

చరణం 1:
నిన్ను చూడక నిదురపోనీ రెండూ నేత్రాలు 
కలల హారతి నీకు పట్టే మౌనమంత్రాలు 
నిన్ను తాకక నిలవలేనీ పంచప్రాణాలు 
కౌగిలింతలా గర్భగుడిలో మూగ దీపాలు 
ప్రేమ మహిమ తెలుప తరమా ......... ప్రేమ జీవన మధురిమ   //నేను//

చరణం 2:
శ్రీ అనే తెలుగక్షరంలా నీవు నిలుచుంటే 
క్రావడల్లే నీదు వెలుగులా ప్రమిదనై ఉంటా 
ఓం అనే వేదాక్షరంలా నీవు ఎదురైతే 
నాదమై నిన్నాలపించే ప్రణవమై ఉంటా 
ప్రేమ మధుమ తెలియ తరమా ......... ప్రేమ జీవన మధురిమ   //నేను//
 

Bhajans

Kids Telugu Rhymes

Private & Folk Songs