Social Icons

Pages

Sankranti Songs

సంక్రాంతి పాటల పల్లకి వెండితెరపై బంగారంలా మెరిసిన సంక్రాంతి పాటలను పాడుకోవాలనుకుంటున్నారా? ఇక్కడ మూడు పాటలు ఉన్నాయి. మురిపెంగా పాడుకోండి... గాలిపటాన్ని ఆట పట్టించండి. 'బావల వీపులు తప్పెట్లోయ్' అంటూ పల్లెల్లోని అల్లరిని గుర్తు తెచ్చుకోండి.
చిత్రం :కులదైవం (1980)
రచన : కొసరాజు
సంగీతం : మాస్టర్ వేణు
 గానం : ఘంటసాల, జమునారాణి

 పల్లవి:
పదపదవే వయ్యారి గాలిపటమా (2)
పైన పక్షిలాగా ఎగిరిపోయి పక్కచూపు చూసుకుంటూ తిరిగెదవే గాలిపటమా
పదపదవే వయ్యారి గాలిపటమా

చరణం:1
 ప్రేమగోలలోన చిక్కిపోయినావా
నీ ప్రియుడున్న చోటుకై పోదువా
 ఓ... ప్రేమగోలలోన చిక్కిపోయినావా
నీ ప్రియుడున్న చోటుకై పోదువా
నీ తళుకంతా నీ కులుకంతా
అది ఎందుకో తెలుసును అంతా             //పదపడవే//

 చరణం:2
 నీకు ఎవరిచ్చారే బిరుదు తోక
 కొని తెచ్చావేమో అంతేగాక
ఆ... నీకు ఎవరిచ్చారో బిరుదు తోక
 కొని తెచ్చావేమో అంతేగాక
రాజులెందరూడినా మోజులెంత మారినా
తెగిపోక నిల్చె నీ తోక               //పదపదవే//

 చరణం:3
నీలి మబ్బుల్లో ఆడుకుందువేమో
మింట చుక్కల్లో నవ్వుకుందువేమో //నీలీ //
 వగలాడివిలే జగదంతవులే
 దిగిరాకుండా ఎటులుందువులే      //పదపదమే//

 చిత్రం : భోగిమంటలు (1981)
 రచన : ఆచార్య ఆత్రేయ
 సంగీతం : రమేష్ నాయుడు
గానం : బాలు, సుశీల, బృందం

పల్లవి : 
భోగుల్లో భోగుల్లో భోగభాగ్యాల భోగుల్లో... భోగిమంటల భోగుల్లో...
తెల్లారకుండానే పల్లెపల్లంతాను ఎర్రని కాంతుల భోగుల్లో     //తెల్లారకుండానే//
భోగుల్లో భోగుల్లో భోగభాగ్యాల భోగుల్లో... భోగిమంటల భోగుల్లో...
తెల్లారకుండానే పల్లెపల్లంతాను ఎర్రని కాంతుల భోగుల్లో
 గొబ్బియల్లో గొబ్బియల్లో గొబ్బెమ్మ కొప్పున గుమ్మడిపూలో //గొబ్బియల్లో//

 చరణం : 1
 గుమ్మడంటి గుమ్మడు మాయదారి గుమ్మడు
 కొప్పులో పూలెట్టి తుప్పల్లోకి లాగాడు
 గొబ్బియల్లో గొబ్బియల్లో గొబ్బెమ్మ కొప్పున గుమ్మడిపూలో
 కుప్పల్లో ఇల్లుందా అల్లుళ్లే కుప్పమ్మా
అత్తంటికెళదాము రమ్మంటే తప్పమ్మా
తప్పొప్పులిప్పుడై తలబోసుకుందామా
తలలంటుకున్నాక తలబోసుకుందామా
గొబ్బియల్లో గొబ్బియల్లో గొబ్బెమ్మ కొప్పున గుమ్మడిపూలో
 భోగుల్లో భోగుల్లో భోగభాగ్యాల భోగుల్లో... భోగిమంటల భోగుల్లో...
తెల్లారకుండానే పల్లెపల్లంతాను ఎర్రని కాంతుల భోగుల్లో
హరిలో... రంగహరి... హరిలో రంగహరి... హరిలో రంగహరి...
హరిలో రంగహరి... హరిలో రంగహరి... హరిలో రంగహరి...
హరిలో రంగహరి... హరిలో రంగహరి... హరిలో రంగహరి...
హరి కోసమైతే తపస్సులు హరి హరి
హరిదాసుకైతే కాసుల హరి హరి
 దాసుని తప్పులు దండనతోసరి
హరిలో రంగహరి... హరిలో రంగహరి... హరిలో రంగహరి...
 సరిలో రంగసరి... సరిలో రంగసరి... సరిలో రంగసరి...
దండం ఆంటే రెండర్థాలు
 చేతులు రెండు కలిపేదొకటి
వాతలు నిండుగా వేసేదొకటి
హొయ్... చేతులు రెండు కలిపేదొకటి
వాతలు నిండుగా వేసేదొకటి
సరిలో రంగసరి... సరిలో రంగసరి... సరిలో రంగసరి...
సరిలో రంగసరా హరా సరా  హరా
 మ్మ్ ... సరి సరి
 హరిలో... రంగహరి...
భోగుల్లో భోగుల్లో భోగభాగ్యాల భోగుల్లో... భోగిమంటల భోగుల్లో..
తెల్లారకుండానే పల్లెపల్లంతాను ఎర్రని కాంతుల భోగుల్లో

చరణం:2
బావల వీపులు తప్పెట్లోయ్ తాగినకొద్ది తప్పట్లోయ్ //బావల వీపులు//
అవి  మోగినకొద్దీ ముచ్చట్లోయ్
అవి మోగినకొద్దీ ముచ్చట్లోయ్
 మరదళ్ల బుగ్గలు బొబ్బట్లోయ్ కొరికినకొద్దీ దిబ్బట్లోయ్ // మరదళ్ల//
అవి దొరికేదాకా ఇక్కట్లోయ్ దిబ్బట్లోయ్ బొబ్బట్లోయ్
భోగుల్లో భోగుల్లో భోగభాగ్యాల భోగుల్లో... భోగిమంటల భోగుల్లో...
తెల్లారకుండానే పల్లెపల్లంతాను ఎర్రని కాంతుల భోగుల్లో
 తెల్లారకుండానే పల్లెపల్లంతాను ఎర్రని కాంతుల భోగుల్లో
 

Bhajans

Kids Telugu Rhymes

Private & Folk Songs