పాట : జోల పాట పాడి
చిత్రం : ఇది కథ కాదు
రచన : ఆత్రేయ
సంగీతం : ఎం. ఎస్ . విశ్వనాథన్
గానం : సుశీల
పల్లవి :
జోలపాట పాడి ఊయలూపనా ....... నా జాలికథను చెప్పి మేలుకొలపనా (2)
//జోలపాట//
పెళ్లాడిన ఆ మగడు ప్రేమించిన ఈ ప్రియుడు .... వెళ్లారు నన్ను విడిచి వచ్చావు నువ్వు ఒడికి
వచ్చావు నువ్వు ఒడికి........ //జోలపాట//
చరణం 1:
చేసుకున్న బాసలన్ని చెరిగిపోయెను
నే రాసుకున్న విన్నపాలు చేరవాయెను //చేసుకున్న//
ఆకసాన చీకటులే ఆవరించెను
ఆశలన్ని విడిచివున్న నేడు వెన్నెలొచ్చెను //జోలపాట//
చరణం 2:
మీరా మనసార నాడు వలచెను గోపాలుని
కోరిక నెరవేరక చేపట్టెను భూపాలుని //మీరా//
ఆ కథకు నా కథకు అదే పోలిక
ఆ మీదట ఏమైనది చెప్పలేనిక //జోలపాట//
చరణం 3:
నల్లనయ్య నాడూదెను పిల్లనగ్రోవి
ఆమె పరవశించి పోయినదా గానము గ్రోలి //నల్లనయ్య//
మరువరాని ఆ మురళి మరల మ్రోగెను
ఆ మధుర గానమునకు బాబు నిదురపోయెను