పాట - నిన్న లేని అందమేదో
చిత్రం : పూజ ఫలం
సంవత్సరం : 1964
సంగీతం: రాజేశ్వర రావు
రచన : సి. నారాయణ రెడ్డి
గానం: ఘంటశాల
పల్లవి:
నిన్న లేని అందమేదో
నిదురలేచెనెందుకో నిదురలేచెనెందుకో
తెలియలేని రాగమేదో
తీగసాగెనెందుకో తీగసాగెనెందుకో
నాలో
నిన్న లేని అందమేదో .... నిదురలేచెనెందుకో నిదురలేచెనెందుకో
చరణం 1:
పూచిన ప్రతి తరువొక వధువు
పువ్వు పువ్వున పొంగిన మధువు
ఇన్నాళ్లీ శోభలన్నీ ఎచట దాగెనో //నిన్న లేని//
చరణం 2:
చెలి నురుగులే నవ్వులు కాగా
సెలయేరులు కులుకుతు రాగా
కనిపించని వీణలేవో కదలి మ్రోగెనే //నిన్న లేని//
చరణం 3:
పసిడి అంచు పైట జార
పయనించే మేఘబాల
అరుణకాంతి సోకగానే పరవశించెనే //నిన్న లేని//