Social Icons

Pages

Old Telugu Music - Song Lyric - Thakita Thadhimi

పాట : తకిట తథిమి తకిట తథిమి తందాన 
చిత్రం : సాగర సంగమం
రచన : వేటూరి
సంగీతం : ఇళయరాజా 

పల్లవి: 
తకిట తథిమి తకిట తథిమి తందాన 
హృదయ లయల జతుల గతుల తిల్లానా 
తకిట తథిమి తకిట తథిమి తందాన 
హృదయ లయల జతుల గతుల తిల్లానా 
తడబడు అడుగుల తప్పని తాళాన 
తడిసిన పెదవుల రేగిన రాగాన 
శ్రుతిని లయని ఒకటి చేసి                      //తకిట తథిమి//

చరణం :
నరుడి బ్రతుకు నటన...... ఈశ్వరుడి తలపు ఘటన 
ఆ రెంటి నట్ట నడుమ నీకెందుకింత తపన 
తెలుసా మనసా నీకిది తెలిసీ అలుసా 
తెలిసీ తెలియని ఆశల వయసీ వయసా 
తెలుసా మనసా నీకిది తెలిసీ అలుసా 
తెలిసీ తెలియని ఆశల లలలా లల లా ..... 
ఏటిలోన అలల వంటి .... కంటిలోన కలలు కదిపి 
గుండియలను అందియలుగా చేసి 
తకిట తథిమి తకిట తథిమి తందాన
హృదయ లయల జతుల గతుల తిల్లానా
తడబడు అడుగుల తప్పని
     తకిడతోం తకిడతోం
తడిసిన పెదవుల రేగిన ఆ..... ఆ .... ఆ
శ్రుతిని లయని ఒకటి చేసి                      //తకిట తథిమి//

చరణం :
పలుకు రాగమధురం ... నీ బ్రతుకు నాట్య శిఖరం 
సప్తగిరులుగా వెలసే సుస్వరాల గోపురం  
అలరులు కురియగ నాడెనదే 
అలకల కులుకుల అలమేల్ మంగ 
అలరులు కురియగ నాడెనదే 
అలకల కులుకుల అలమేల్ మంగ 
అన్న అన్నమయ్య మాట 
అచ్చ తేనె తెనుగ పాట 
పల్లవించు పదకవితలు పాడి       //తకిట తథిమి//
 

Bhajans

Kids Telugu Rhymes

Private & Folk Songs