Andaaniki Andam Song Lyric in Siri Siri Muvva
చిత్రం: సిరిసిరిమువ్వ
రచన: వేటూరి
సంగీతం: కె. వి. మహదేవన్
గానం: బాలు
పల్లవి: అందానికి అందం ఈ పుత్తడిబొమ్మా
అందరికీ అందనిదీ పూచిన కొమ్మా //అందానికి//
పుత్తడిబొమ్మా ........ పూచిన కొమ్మా....... ఆ ....
చరణం 1: పలకమన్న పలకదీ పంచదార చిలక
కులుకే సింగారమైన కొలసిగ్గుల మొలక //పలకమన్న//
ఎదకన్నా లోతుగా పదిలంగా దాచుకో //ఎదకన్నా//
నిదురించే పెదవిలో పదముందీ పాడుకో
పుత్తడిబొమ్మా ........ పూచిన కొమ్మా....... ఆ .... //అందానికి//
చరణం 2: ఆ రాణి పాదాల పారాణి జిలుగులో
నీ రాజభోగాలు పాడనీ తెలుగులో //ఆ రాణి //
ముడివేసిన కొంగునే గుడి ఉంది తెలుసుకో //ముడివేసిన//
గుడిలోని దేవతని గుండెలో కలుసుకో

వచనం: ఈ జన్మకింతే ఇలా పాడుకుంటాను
ముందు జన్మ వుంటే ఆకాలి మువ్వనై పుడతాను