హిమగిరి సొగసులు - పాండవ వనవాసం
చిత్రం : పాండవ వనవాసం
గానం: ఘంటసాల & సుశీల.
సంగీతం: ఘంటసాల
రచన:సముద్రాల(sr)
హిమగిరి సొగసులు .... మురిపించును మనసులు
చిగురించునేవో ఏవో ఊహలు
యోగులైనా మహాభోగులైనా... మనసుపడే మనోజ్ఞ సీమ
సురవరులూ సరాగాల చెలులూ... కలసే సొలసే అనురాగ సీమ
ఈ గిరినే ఉమాదేవి హరుని... సేవించి తరించెనేమో..
సుమశరుడూ.. రతీదేవి జేరి
కేళీ, తేలీ లాలించెనేమో....