Social Icons

Pages

Old Telugu Music - Mavayya Annapilupu in Muddula Mavayya

మావయ్య అన్న పిలుపు - ముద్దుల మామయ్య  

చిత్రం : ముద్దుల మామయ్య 

గానం: ఎస్పీ బాలు, శైలజ, సుశీల.

సంగీతం: కె.వి.మహాదేవన్ 

పల్లవి: 

 మావయ్య అన్న పిలుపు మా ఇంట్లో ముద్దులకు పొద్దు పొడుపు , 

కమ్మగా పాడనా కంటిపాప జోల కానుకే ఇవ్వనా చెల్లికి ఉయ్యాల 

చరణం 1: 

అరచేత పెంచాను చెల్లిని...

ఈ అరుదైన బంగారు తల్లిని అడుగేస్తే పాదాలు కందవా.... 

నా కన్నుల్లో కన్నీళ్లు చిందవా 

 అమ్మగా లాలించాడు -

నిన్ను నాన్నగా పాలించాడు 

అన్నగా ప్రేమించాడు అన్నీ తానైనాడు 

తన ప్రాణంలా నను పెంచాడు. ఆ  దైవంగా దీవించాడు

నా అన్నలాంటి అన్న ఈ లోకాన లేడు                     //మావయ్య//

 చరణం 2: 

ఆరేడు మాసాలు నిండగా.... ఈ అన్నయ్య కలలన్నీ పండగా 

తేవాలి బంగారు ఊయల..... కావాలి మా ఇల్లు కోవెల 

రెప్పగా నిను కాచనా

పాపగా నిను చూడనా 

రేపటి ఆశ తీరగా ఈ పాపకు జోలపాడనా

 ఇది అరుదైన ఓ అన్న కథ 

 ఇది మురిపాల ఓ చెల్లి కథ 

ఇది చెల్లెలే కాదులే నను కన్నతల్లి             //మావయ్య//

 

Bhajans

Kids Telugu Rhymes

Private & Folk Songs