నీ చరణ కమలాల నీడయే చాలు - శ్రీ కృష్ణావతారం
చిత్రం: శ్రీ కృష్ణావతారం
సంగీతం: టి. వి. రాజు
రచన: సి. నారాయణ రెడ్డి
గానం: ఘంటసాల, లీల, సుశీల
నీ చరణ కమలాల నీడయే చాలు ఎందుకోయీ స్వామీ బృందావనాలు ...
నీ నయన కమలాల నేనున్న చాలు ఎందుకే ఓ దేవి నందనవనాలు ...
నునుమోవి చివురు పై నను మురళిగా మలచి
పలికించరా - మధువు లొలికించరా
మోవిపై కనరాని మురళిలో వినలేని
రాగాలు పలికింతునే మధురానురాగాలు చిలికింతునే ...
నీ ప్రణయ వనిలోన నేనున్న చాలు ఎందుకోయీ స్వామి నందనవనాలు
నీ హృదయ గగనాన నేనున్న చాలు ఎందుకే ఓ దేవి బృందావనాలు
తులసీ దళాలలో తొలి వలపు లందించి
పూజింతునా ... స్వామి పులకింతునా ...
పూజలను గ్రహియించి పులకింత లందించి
లోలోన రవళింతునే ఓ దేవి
నీలోన నివసింతునే ....
నీ చరణ కమలాల నీడయే చాలు ఎందుకోయీ స్వామి బృందావనాలు ...
నీ నయన కమలాల నేనున్న చాలు ఎందుకే ఓ దేవి నందనవనాలు ...
నీ ప్రణయ వనిలోన నేనున్న చాలు ఎందుకోయీ స్వామి నందనవనాలు
పహాడ్ రాగ స్వరాలతో టి.వి.రాజు ఈ పాటలో ప్రణయ జగత్తుకి ఊయలలు వేసి ప్రేక్షక హృదయాల్ని మంత్రముగ్ధుల్ని చేశారు. ఘంటసాల గాత్రంలోని మృదుత్వం, పి.లీల గళంలోని సందర్భోచిత గాంభీర్యం, పి.సుశీల స్వరంలోని ఆత్మసైర్యం ముప్పేటలా అల్లుకుని ఈ పాట ఇన్నేళ్లయినా మనల్ని మంత్రముగ్దల్ని చేస్తూనే ఉంది.