రానిక నీ కోసం - మాయని మమత
చిత్రం: మాయని మమత
సంగీతం: అశ్వత్థామ
రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: ఘంటసాల
సాకీ: పైకి కనరాకుండ వాడిపోయేది లోకాన హృదయ సుమమొకటే
పెదవిపై నవ్వు పున్నమి పూచినా మదిలో అమావాస్య చీకటే
పల్లవి: రానిక నీ కోసం సఖీ రాదిక వసంత మాసం
రాలిన సుమాలు ఏరుకుని జాలిగ గుండెల దాచుకుని
ఈ దూరపు సీమలు చేరుకుని
చరణం 1. వాకిటిలో నిలబడకు ఇంక నాకై మరి మరి చూడకు
ప్రతి గాలి సడికి తడబడకు పద ధ్వనులని పొరబడకు
కోయిల పోయెలే గూడు గుబులైపోయేలే
చరణం 2. పగలంతా నా మదిలో మమతలు సెగలై లోలో రగులునులే
నిద్ర రాని నిశినైనా నాకీ నిష్ఠుర వేదన తప్పదులే
పోనీలే ఇంతేలే గూడు గుబులైపోయేలే