Social Icons

Pages

Old Telugu Music - Malle Teegaku Pandirivole Song Lyric in Orey Rikshaw

మల్లె తీగకు పందిరివోలె...  పాటు కచేరి

చిత్రం: ఒరేయ్ ... రిక్షా !

సంగీతం, గానం: వందేమాతరం శ్రీనివాస్

పల్లవి: 

మల్లె తీగకు పందిరివోలె... మస్కచీకటిలో వెన్నెలవోలె

నీ పాదంమీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా.. తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా 

చరణం: 1 

పెద్దమనిషివై పూసిననుండే... ఆడపిల్లపై ఆంక్షలు ఎన్నో

చూసేదానిని చూడొద్దంటరు.. నవ్వేచోట నవ్వొద్దంటరు

అటువంటినే అన్ననుగాను చెల్లెమ్మా.. నీ చిన్ననాటి స్నేహితునమ్మా చెల్లెమ్మా

అడవిలోన నెమలివోలె చెల్లెమ్మా.. ఆటలాడుకో పాటపాడుకో చెల్లెమ్మా //మల్లెతీగకు//

చరణం: 2: 

సిన్నబోయి నువు కూసున్నవంటే.. ఎన్నుపూస నాదిరిగేనమ్మా

ఒక్క క్షణము నువు కనపడకుంటే.. నా కనుపాపలు కమిలిపోతయి

ఒక్క ఘడియ నువు మాటాడకుంటే చెల్లెమ్మా.. నే దిక్కులేని పక్షినైతానమ్మా చెల్లెమ్మా 

బువ్యదినక నువు అలిగినవంటే చెల్లెమ్మా.. నా బుజం ఇరిగినంత పనైతదమ్మా చెల్లెమ్మా

                                                                                                            //మల్లెతీగకు//

చరణం : 3

చదివినంత నిన్ను చదివిస్తనమ్మా.. ఎదిగినంత నిన్ను ఎదిగిస్తనమ్మా

నీకు పెళ్లీడు వచ్చేనాటికి పువ్వోపత్రో కూడబెట్టుతా

నచ్చినోనికే ఇస్తానమ్మా చెల్లెమ్మా.. నా కన్నీళ్లతో కాళ్లు కడుగుతా చెల్లెమ్మా

రిక్షాబండిని మేనా కడతా చెల్లెమ్మా.. మీ అత్తోరింటికి  సాగనంపుతా చెల్లెమ్మా | మల్లెతీగకు॥

 

Bhajans

Kids Telugu Rhymes

Private & Folk Songs