Social Icons

Pages

Old Telugu Music - Paadavoyi Bharatheeyuda Song Lyric in Velugu Needalu

 పాడవోయి భారతీయుడా....

చిత్రం : వెలుగు నీడలు (1961)

 రచన :శ్రీశ్రీ 

సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు 

గానం : ఘంటసాల, పి.సుశీల, బృందం

 పల్లవి :

పాడవోయి భారతీయుడా

ఆడి పాడవోయి విజయగీతిక        (2) 

 పాడవోయి భారతీయుడా

నేడే స్వాతంత్య్రదినం వీరుల త్యాగఫలం (2)

నేడే నవోదయం నీదే ఆనందం ఓ...           ||పాడవోయి||


చరణం:1

స్వాతంత్య్రం  వచ్చెనని సభలే చేసి.. సంబర పడగానే సరిపోదోయీ  (2)

సాధించిన దానికి సంతృప్తిని పొంది.. అదే విజయమనుకుంటే పొరపాటోయి

ఆగకోయి భారతీయుడా.. కదలి సాగవోయి ప్రగతిదారులా  (2)

ఆగకోయి భారతీయుడా


చరణం:2

ఆకాశం అందుకొనే ధరలొక వైపు..  అదుపులేని నిరుద్యోగమింకొక వైపు  (2)

అవినీతి బంధుప్రీతి చీకటి బజారు..  అలముకున్న నీ దేశం ఎటు దిగజారు 

కాంచవోయి నేటి దుస్థితి ... ఎదిరించవోయి ఈ పరిస్థితి (2)

కాంచవోయి నేటి దుస్థితి.


చరణం:3 

పదవీ వ్యామోహాలు కులమత భేదాలు - భాషా ద్వేషాలు చెలరేగే నేడు (2)

ప్రతి మనిషి మరియొకని దోచుకునే వాడే..     (2)

తన సౌఖ్యం తన భాగ్యం చూసుకునేవాడే 

స్వార్ధమీ అనర్థకారణం... అది చంపుకొనుటె క్షేమదాయకం (2) 

స్వార్ధమీ అనర్థకారణం 


చరణం :4

 సమ సమాజ నిర్మాణమే నీ ధ్యేయం .. నీ ధ్యేయం 

సకల జనుల సౌభాగ్యమె నీ లక్ష్యం .. నీ లక్ష్యం

 సమ సమాజ నిర్మాణమే నీ ధ్యేయం..   సకల జనుల సౌభాగ్యమె నీ లక్ష్యం    (2)

ఏక దీక్షతో గమ్యం చేరిన నాడే 

లోకానికి మన భారతదేశం .. అందించునులే శుభ సందేశం   (2)

ఆ ఆ ఆ ..... 

లోకానికి మన భారతదేశం అందించునులే శుభ సందేశం (2)

 

Bhajans

Kids Telugu Rhymes

Private & Folk Songs