Social Icons

Pages

Old Telugu Music - Prema Yatralaku Song Lyric in Gundamma Katha

 ప్రేమ యాత్రలకు బృందావనమూ.. 

చిత్రం: 'గుండమ్మ కథ' (1962)

రచన: పింగళి నాగేంద్రరావు

సంగీతం: ఘంటసాల

గానం: పి.సుశీల, ఘంటసాల

పల్లవి:

 ప్రేమ యాత్రలకు బృందావనమూ.. నందన వనమూ ఏలనో

కులుకులొలుకు చెలి చెంతనుండగా.. వేరే స్వర్గము ఏలనో

అహహ అహహా...

కులుకులొలుకు చెలి చెంతనుండగా.. వేరే స్వర్గము ఏలనో

                                                                                                     ॥ప్రేమ యాత్రలకు ||

తీర్థయాత్రలకు రామేశ్వరము..  కాశీ ప్రయాగలేలనో

ప్రేమించిన పతి ఎదుటనుండగా... వేరే స్వర్గము ఏలనో

అహహ అహహా...

 ప్రేమించిన పతి ఎదుటనుండగా.. వేరే స్వర్గము ఏలనో   || తీర్థయాత్రలకు ||

చరణం: 1

చెలి నగుమోమే చంద్రబింబమై  పగలే వెన్నెల కాయగా (2)

సఖి నెరిచూపుల చల్లదనంతో... జగమునె ఊటీ శాయగా

అహహ అహహా...

సఖి నెరిచూపుల చల్లదనంతో...జగమునె ఊటీ శాయగా

ప్రేమ యాత్రలకు కొడైకెనాలూ కాశ్మీరాలూ ఏలనో... 

 చరణం: 2 

కన్నవారినే మరువజేయుచూ.. అన్ని ముచ్చటలు తీర్చగా (2) 

పతి ఆదరణే సతికి మోక్షమని.. సర్వ శాస్త్రములు చాటగా 

అహహ అహహా...

పతి ఆదరణే సతికి మోక్షమని.. సర్వశాస్త్రములు చాటగా

తీర్థయాత్రలకు కైలాసాలూ వైకుంఠాలూ ఏలనో.. 

అన్యోన్యంగా దంపతులుంటే భువికి స్వర్గమే దిగిరాదా... 

ప్రేమ యాత్రలకు బృందావనమూ..నందన వనమూ ఏలనో....

 

Bhajans

Kids Telugu Rhymes

Private & Folk Songs